Jul 29,2021 22:16

నిరసన తెలుపుతున్న రైతులు

పుట్లూరు : తాము సాగుచేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో రైతులు తహశీల్దారు కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. కడవకల్లు గ్రామంలోని సర్వే నెంబర్‌ 302లో ఉన్న ప్రభుత్వ భూమిలో దాదాపు 150 మంది పేదలు ఆరు సంవత్సరాల నుంచి పంట సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పద్మావతి చెప్పారంటూ కొందరు వైసిపి నాయకులు పేదలు సాగుచేసుకుంటున్న భూమిని ఆక్రమించారన్నారు. ఈ భూమిలోకి వస్తే మీ అంతు చూస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. తాము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రామాంజనేయులు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్‌.సూరి, రైతు సంఘం మండల కార్యదర్శి జి.వెంకట చౌదరి, మండల అధ్యక్షుడు పి.బాల గురవయ్య, కార్యదర్శి, సత్తార్‌, గోపాల్‌, రైతు సంఘం సహాయ కార్యదర్శి బి.వెంకటశివారెడ్డి, మహిళా రైతులు మల్లేశ్వరి, నారాయణమ్మ, నాగమ్మ, సాలమ్మ, పుల్లమ్మ, ఈశ్వరమ్మ, కళావతి, లక్ష్మీదేవి, నాగ మహేంద్ర పాల్గొన్నారు.