Mar 28,2023 00:39

తాడేపల్లి రూరల్‌:భవిష్యత్తులో తృణధాన్యాలే మానవులకు ఆహారంగా ఉండ బోతున్నాయని ప్రముఖ ఆహార నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఖాదర్‌ వలి అన్నారు. సోమ వారం ఉదయం కెఎల్‌ విశ్వ విద్యా లయంలోని ఆర్‌ అండ్‌ డి హాలులో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథులుగా హాజరైన ఖాదర్‌ వలి, పద్మశ్రీ యడవలి వెంక టేశ్వరరావు విద్యార్ధుల నుద్దేశించి మాట్లాడారు. ఫుడ్‌ టెక్నాలజీ, వ్యవసాయ , బయో టెక్నాలజీ, ఫార్మసీ విభాగాల అధ్వర్యంలో నిర్వహించారు. ఖాదర్‌ వలి మాట్లాడుతూ ఆధునిక యుగం లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల వ్యాధుల నివారణ గురించి అవగాహన కల్పించారు. మాం సాహారం, వరి, గోదుమల విని యోగాన్ని తగ్గించాలని సూచిం చారు. వాటిని అది óకంగా వాడడం వలన బాల బాలికల్లో హార్మోన్ల విడు దలలో తీవ్ర ప్రభావం చూపు తుం దన్నారు. అనంతరం వ్యవసాయ విభాగ డైరెక్టర్‌ డాక్టర్‌ రత్నప్రసాద్‌, ఫుడ్‌ టెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్‌ కె.శ్రీనివాసులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఖాదర్‌ వలిని కెఎల్‌ యు అధ్యాపకులు సత్కరించారు.