
ప్రజాశక్తి-కొత్తపేట : మామిడికాయ సహజంగా 50 గ్రాములు నుండి అతి పెద్ద కాయ అయితే 300 గ్రాములు వరకు ఉంటుంది కానీ మండల పరిధిలోని బిళ్ళకుర్రు శివారు డేగల వారి పాలెం గ్రామంలో రైతు డేగల నిరంజన్ కుమార్ కొబ్బరి తోటలో వారి తండ్రిగారు పాతిన మామిడి చెట్టు నాలుగు సంవత్సరాల నుండి కాయలు కాస్తున్నాయి. కానీ ఈ ఏడాది గతసంవత్సరాల కంటే పెద్దగా సుమారు నాలుగు కేజీలు పైబడి ఉన్నది. ప్రక్కనే కొబ్బరి బొండం పెట్టిన వాటి సైజు మించి మామిడికాయ ఉన్నది. మామిడికాయను చూసి పలువురు ఆశ్చర్యపోయితున్నారు. మామిడికాయను చూసేందుకు ఇరుగుపొరుగువారు సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. రైతు నిరంజన్ కుమార్ మాట్లాడుతూ గతంలో మా నాన్న నర్సరీ నుండి తీసుకువచ్చి పొలంలో పాతిననారు. చెట్టు పెద్దదై నాలుగు సంవత్సరాల నుండి కాయలు కాస్తున్నాయి. పేరు ఎవరూ చెప్పలేకపోవడంతో కొబ్బరిబొండంగా నామకరణ చేసి పిలుస్తున్నాము. పచ్చికాయ చాలా పుల్లగాను ముగ్గిన తరువాత చాలా తీపిగాను ఉంటుందని మిగిలిన మామిడి లాగా చెట్టు నిండా పూత పూయటం, కాయలు పెద్ద సైజు కావడంతో 20 నుంచి 30 కాయల వరకు మాత్రమే దిగుబడినిస్తుందని అన్నారు. పండిన కాయలను ఆనందంగా బంధువులకు పంచుకుంటున్నామన్నారు.