
- పార్లమెంట్‌కు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : 2018 నుండి హైకోర్టులకు మొత్తంగా 569 మంది న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. 569మందిలో 17మంది మాత్రమే ఎస్‌సిలు, తొమ్మిది మంది మాత్రమే ఎస్‌టిలు, మరో 64మంది ఇతర వెనుకబడిన వర్గాల వారు ఉనాురని, 15మంది మైనారిటీలకు చెందినవారని తెలిపింది. మరో 20మంది న్యాయమూర్తుల సామాజిక నేపథ్య సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సామాజిక వైవిధ్యతకు సంబంధించిన డేటా రికార్డింగ్‌ను సుప్రీంతో సంప్రదించిన అనంతరం ప్రభుత్వం వ్యవస్థీకరించింది. పార్లమెంట్ సభ్యుడు నబా కుమార్ సరానియా అడిగిన ప్రశుకు న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిస్తూ, కోర్టు వెబ్‌సైట్‌ల్లో వున్న సమాచారం మేరకు, 2021 డిసెంబరు 11నాటికి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు 436మంది వుండగా, అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ 3,041మంది వున్నారని చెప్పారు. హైకోర్టుల్లో 1306 మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారని తెలిపారు.