
ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై శివసేన నేత ఉద్ధవ్ థాకరే విరుచుకుపడ్డారు. ఏక్‌నాథ్ షిండే బిజెపితో ఒప్పందం చేసుకున్నా.. మహారాష్ట్రలో ఒక్క ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేయలేకపోయారని మండిపడ్డారు. సబర్బన్ గోరెగావ్‌లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ... ఫ్యాక్టరీలు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నా.. ఏక్‌నాథ్ షిండే నోరు మెదపకుండా ఉన్నారని ధ్వజమెత్తారు. 20 బిలియన్ డాలర్ల వేదాంత-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను బిజెపి గుజరాత్‌కు తరలించుకుపోయినా.. ముఖ్యమంత్రి ప్రజలను అబద్ధాలతో మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. దేశానికి ముంబయి ఆర్థిక రాజధాని అని, ఇక్కడి పరిశ్రమలను మీ రాష్ట్రానికి తరలించుకుపోతున్నారని.. ఇందుకు మీరు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.