Aug 17,2022 18:30

మనం తాగే నీరు మురికిగా ఉంటేనే వాటిని తాగడం మానేస్తాం. అలాంటిది.. నీరు నల్లగా కాషాయంలా కనిపిస్తే.. తాగుతామా? ఇలాంటి నీరు తాగడం వల్ల.. అనారోగ్యాలు దరిచేరుతాయని వాటిని దూరం పెట్టేస్తాం. అయితే.. బ్లాక్‌ వాటర్‌ని.. సినీ తారలు మాత్రం ఎగబడి తాగుతున్నారట. అసలు వారెందుకు బ్లాక్‌ వాటర్‌ని తాగుతున్నారు? వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...?!

బ్లాక్‌ వాటర్‌ ప్రయోజనాలు

1. శరీరానికి సరిపడా ఈ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలను నివారిస్తుంది.
2. బ్లాక్‌ వాటర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మితంగా ఆహారంగా తీసుకుంటారు. దాంతో శరీర బరువు తగ్గుతుంది.
3. ఈ నీరు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
4. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్‌ వాటర్‌ సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
5. వేసవిలో ఈ నీటిని తీసుకుంటే.. సన్‌స్ట్రోక్‌ నుంచి బయటపడవచ్చు. బ్లాక్‌ వాటర్‌ శరీర వేడిని తగ్గిస్తుంది.
6. బ్లాక్‌ వాటర్‌ రక్తపోటును అదుపులో ఉంచడం, కీళ్లలో జిగురు పెంచడంలోనూ శరీర కీలకమైన విధుల్లో పాల్గొంటుంది. జీవక్రియ, నాడీ సంబంధిత విధులను మారుస్తుంది. మనం రోజూ తీసుకునే నీటిలో సాధారణంగా అకర్బన లవణాలు ఉంటాయి. అయితే ఇందులో నీరు ఎక్కువ ఆల్కలీన్‌గా ఉంటుంది. బ్లాక్‌ వాటర్‌ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. మన దేశంలో బ్లాక్‌ వాటర్‌ బ్లాక్‌ ఆల్కలీన్‌ వాటర్‌గా దొరుకుతుంది.