
ప్రజాశక్తి-మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణాజిల్లా శాఖ అధ్వర్యంలో యూనివర్సిటీ యూత్ రెడ్ క్రాస్ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె బీ చంద్రశేఖర్ ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణాజిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ టి ఎస్ ఎస్ బాలాజీ ప్రసంగిస్తూ రక్తదానం యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. రక్తదాన కార్యక్రమంలో యూనివర్సిటీ కి సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులతో పాటుగా స్థానిక నోబుల్ కళాశాల, వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, బాల సాయి డిగ్రీ కళాశాల, విజయానంద్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంప్ నిర్వహణలో రెక్టర్ సూర్యచద్ర రావు యూనివర్సిటీ ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థిని, విద్యార్థులు సేవలందించారు. విద్యార్థినీ విద్యార్థులను డాక్టర్ హనుమంతయ్య, ఐ ఆర్ సి ఎస్ వైస్ చైర్మన్ డాక్టర్ వంగర శేషగిరి పరిశీలించి రక్తదానానికి అర్హులైన విద్యార్థులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంసి సభ్యులు పాలపర్తి క్రిషి , కోశాధికారి కొండపల్లి రాంబాలాజీ, మేనేజర్ భవిరి శంకర్ నాథ్, డా. పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.