Jan 28,2023 16:23

ప్రజాశక్తి-నందలూరు : మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ నారాయణరాజుపేట జగనన్న కాలనీలో నూతన బోరు, మోటారు ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం నూతన మంచినీటి బోరుకు సర్పంచ్ జంబు సూర్యనారాయణ, హౌసింగ్ డిఇ మురళిలు పూజలు నిర్వహించి ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్ నిధులతో ఈ బోరు మోటర్ ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ జంబు సూర్యనారాయణ తెలిపారు. ఇల్లు నిర్మించుకుంటున్న వారికి అనువుగా నీటి వసతులు కల్పించడం కోసం ఈ బోర్ ఏర్పాటు చేయడం జరిగిందని కాలనీలోని అన్ని ప్రాంతాలకు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. నారాయణరాజుపేట జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ సిబ్బంది, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.