Oct 03,2022 15:31

న్యూఢిల్లీ   :   కెనడాలోని శ్రీభగవద్గీత పార్క్‌లో ధ్వంసం జరిగినట్లు సాక్ష్యాలు లేవన్న వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండించింది. గతంలో ట్రాయర్స్‌ పార్క్‌ అని పిలిచే ఈ పార్కును శ్రీభగవద్గీత పార్కుగా పేరు మార్చి సెప్టెంబర్‌ 28న ప్రారంభించారు. ఈ  వేడుక కోసం తాత్కాలిక సైన్‌ బోర్డును ఉంచామని, తుది సైన్‌ బోర్డుని త్వరలో ఏర్పాటు చేస్తామని  బ్రాంప్టన్ మేయర్ తెలిపారు.  చివరి సైన్‌ పోస్ట్‌ కోసం ప్లేస్‌ హోల్డర్‌గా ఖాళీ గుర్తును ఉంచామని.. అది చూసేందుకు ధ్వంసం చేసినట్లుగా కనిపిస్తుందని  బ్రిటన్‌ మేయర్‌, పోలీసులు తెలిపారు. అటువంటి ఘటనలకు ఆస్కారం లేదని బ్రాంప్టన్‌ మేయర్‌ పాట్రిక్‌ బ్రౌన్‌ తెలిపారు. బ్రాంప్టన్‌లోని శ్రీభగవద్గీత పార్కులో జరిగిన విద్వేషపూరిత నేరాన్ని తాము ఖడిస్తున్నామని కెనడాలోని భారత హైకమిషన్‌ పేర్కొంది. ఈ ఘటనపై కెనడా అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టాలని, నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని ట్విటర్‌లో పేర్కొంది.