Oct 05,2022 09:40

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లోని పౌడి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది నీటిలో మునిగి చనిపోయారు. రిఖినికల్‌-బీరోఖల్‌ రహదారిపై వెళ్తున్న పెళ్లి బస్సు అదుపు తప్పింది.  500 మీటర్ల లోతున నదిలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మృతదేహాలను నది నుండి వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 9 మంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  మంగళవారం రాత్రి  ఈ ప్రమాదం జరగడంతో చీకటి కారణంగా, వారు సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  స్థానికులు తమ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఉపయోగించి లోయలో పడిపోయిన వారి కోసం వెతికారు. రెస్క్యూ టీమ్ సభ్యులకు సహకారం అందించారు. ఈ బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. స్థానిక సమాచారంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.