మరో రూ.62 ప్రియం
న్యూఢిల్లీ : సామాన్యులపై మరోసారి ఆర్థిక భారం పడనుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా చమురు ధరల సవరణతో హోటల్ నిర్వహణ, తినుబండారాల తయారీ ఖర్చులు పెరగనున్నాయి. దూర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లే సామాన్యులు, హోటళ్లలో తినే చిరుద్యోగులు సహా అందరూ ధరల భారం భరించాల్సిన పరిస్థితి నెలకొంది. వాణిజ్య గ్యాస్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు గురువారం నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర రూ.62.50 పెరిగింది. విమానయాన సంస్థలు వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధర లీటరుకు రూ.16 పెరిగి రూ.121 నుంచి రూ.137కు చేరింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఇంధన వ్యయమే ఎక్కువగా ఉంటుంది. ఇది ఆ సంస్థలపై అదనపు భారాన్ని మోపనుంది. ఈ నిర్ణయం అంతిమంగా విమాన ప్రయాణికులపై పడనుంది.








కామెంట్లు (0)