పేటియంకు 42 శాతం వ్యాపారులు గుడ్‌బై

Feb 10,2024 21:24 #Business

న్యూఢిల్లీ : పేటియం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆర్‌బిఐ విధించిన ఆంక్షలు ఆ సంస్థను అగాథంలోకి పడేస్తోంది. ముఖ్యంగా పేటియం మొబైల్‌ పేమెంట్‌ యాప్‌కు 42 శాతం మంది వ్యాపారులు గుడ్‌బై చెప్పారని రిపోర్టులు వస్తోన్నాయి. దేశంలోని కిరాణా స్టోర్లలో దాదాపు సగం పేటియంకు దూరమయ్యాయని, 42 శాతం కిరాణా వ్యాపారులు పేటియంకు బదులుగా ఇతర చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తున్నారని తమ సర్వేలో తేలిందని కిరాణ క్లబ్‌ తెలిపింది. అంతేగాక 68 శాతం కిరాణా వ్యాపారులో పేటియంపై నమ్మకం సన్నగిల్లినట్లు, ఆర్‌బిఐ ఆంక్షల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వినియోగదారులు ఇతర మొబైల్‌ చెల్లింపు యాప్‌లను ఎంచుకుంటున్నారని కిరాణ క్లబ్‌ సిఇఒ అన్షుల్‌ గుప్తా పేర్కొన్నారు.

➡️