పేటియం బ్యాంక్‌కు ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్ల రాజీనామా

Feb 9,2024 21:30 #Business

న్యూఢిల్లీ : పేటియం పేమెంట్‌ బ్యాంక్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే ఆర్‌బిఐ ఆంక్షలతో పీకల్లోతూ కష్టాల్లోకి జారిన ఆ సంస్థకు చెందిన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేశారు. పిపిబిఎల్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పిడబ్ల్యుసి) మాజీ ఎగ్జిక్యూటివ్‌ షింజిని కుమార్‌ గత డిసెంబర్‌లోనే రాజీనామా చేశారని పేటీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మంజు అగర్వాల్‌ కూడా పేటియం బోర్డు నుంచి వైదొలిగారని సమాచారం. మరోవైపు వచ్చే వారం నేషనల్‌ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఎఐ), కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) ప్రతినిధులతో ఆర్‌బిఐ భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటియంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ వినియోగదారుల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని ఫాస్టాగ్‌ చెల్లింపులు పేటియం ద్వారా జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బిఐ భేటీ కీలకం కానుంది.

➡️