ప్రూడెంట్ ప్రమోటర్ సంజయ్ షా నిర్ణయం
అహ్మాదాబాద్ : మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులు, బీమా పరిష్కారాలు, స్టాక్ బ్రోకింగ్ సేవలను అందించేబ ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ (ప్రూడెంట్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజరు షా తన వ్యక్తిగత హోల్డింగ్‌ల నుండి దాదాపు 650 మందికి సుమారు రూ.34 కోట్లు విలువైన 1,75,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారులలో కంపెనీ ఉద్యోగులు, అతని యాజమాన్యంలోని అనుబంధ సంస్థలు, అలాగే ఇంటి పనివారు, డ్రైవర్లు, వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. వ్యాపారంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతగా తన సహచరులకు ఈ షేర్లను అందిస్తున్నట్లు సంజరు షా తెలిపారు. సహచరులుగా తనతో పాటు నిలిచిన వారికి చెప్పే హృదయపూర్వక కృతజ్ఞత అని సంజరు షా పేర్కొన్నారు.