ఇన్ఫోసిస్‌ లాభాల్లో 11.5 శాతం వృద్ధి

బెంగళూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో దిగ్గజ ఐటి సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌ 11.46శాతం పెరుగుదలతో రూ.6,806 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 6,106 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ3లో కంపెనీ రెవెన్యూ 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.38,821 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. గడిచిన క్యూ3లో కంపెనీ నిర్వహణ లాభాల్లో 21.3 శాతం వృద్ధి సాధించింది. క్లయింట్లకు దగ్గర కావడంపై దృష్టి కేంద్రీకరించామని ఇన్ఫోసిస్‌ సిఇఒ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. వైవిధ్యభరితమైన డిజిటల్‌ ఆపరింగ్స్‌తో విజయం సాధించగలమని చెప్పడానికి తమ ఆర్థిక ఫలితాలే నిదర్శనమన్నారు. డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీలో కొత్తగా 5,591 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,379 మందికి చేరుకుందని ఆ కంపెనీ తెలిపింది.

➡️