INSURENCE: జీవిత బీమా నూతన బీమా ప్రీమియంలో 15% వృద్థి

Jun 13,2024 22:14 #Business, #Insurance

ముంబయి : దేశంలోని జీవిత బీమా కంపెనీల నూతన బీమా ప్రీమియం, పాలసీల్లో పెరుగుదల నమోదయ్యింది. ప్రస్తుత ఏడాది మేలో జీవిత బీమా కంపెనీల నూతన వ్యాపార ప్రీమియం (ఎన్‌బిపి) 15.5 శాతం పెరిగిందని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ గణంకాలు వెల్లడించాయి. గడిచిన నెలలో పరిశ్రమ ప్రీమియం ఆదాయం రూ.27,034.2 కోట్లుగా నమోదయ్యింది. 2023 ఇదే నెలలో రూ.23,477.8 కోట్ల ప్రీమియం వసూల్లయ్యింది. గత మే నెలలో వ్యక్తిగత జీవిత బీమా కొత్త పాలసీలు 12.45 శాతం పెరిగి 18,68,096గా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో కొత్తగా 16,61,324 పాలసీలు జారీ అయ్యాయి. 2024 మేలో గ్రూపు పాలసీ ప్రీమియం వసూళ్లు 13.15 పెరుగుదల చోటు చేసుకుంది. వ్యక్తిగత, కార్పొరేట్‌ వినియోగదారుల నుండి మెరుగైన బీమా రక్షణకు బలమైన డిమాండ్‌ చోటు చేసుకుందని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ తెలిపింది. ఇది బీమా విస్తరణలో భవిష్యత్‌ పురోగతికి అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొంది.

➡️