బిఎస్‌ఎన్‌ఎల్‌లో 2 కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లు

May 12,2024 21:20 #Business

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి డేటా వోచర్‌ కాగా.. మరొకటి వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్‌. వీటి ధరలు వరుసగా రూ.58, రూ.59.
రూ.58 ప్లాన్‌ పూర్తి వివరాలు
బిఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న రూ.58 ప్లాన్‌ ఒక డేటా వోచర్‌. దీన్ని పొందాలంటే కచ్ఛితంగా ఒక యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌ ఉండాల్సిందే. దీని వ్యాలిడిటీ ఏడు రోజులు. ప్రతిరోజూ 2 జిబి డేటా లభిస్తుంది. పూర్తి డేటా అయిపోయిన తర్వాత వేగం 40 కెబిపిఎస్‌కు తగ్గిపోతుంది.
రూ.59 ప్లాన్‌ పూర్తి వివరాలు
రూ.59 ప్లాన్‌ వ్యాలిడిటీ ఏడు రోజులు. ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలుండవు. రోజుకు 1 జిబి డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఉంటుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జి సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు ఇటీవల తెలిపాయి. 4జి సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. ప్రయోగాత్మక దశలో 700 – 2,100 మెగాహెర్జ్ట్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో రూపొందించిన 4జి నెట్‌వర్క్‌లో, 40-45 ఎంబిపిఎస్‌ డేటా వేగాన్ని నమోదు చేసినట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు వెల్లడించారు.

➡️