ఆడి లగ్జరీ కార్ల విక్రయాల్లో 33% వృద్థి

Apr 3,2024 21:10 #Business

ముంబయి : దేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్‌ పెరిగిపోయింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో 33 శాతం వృద్థితో 7,027 యూనిట్ల లగ్జరీ కార్లను విక్రయించినట్లు ఆడి ఇండియా తెలిపింది. క్రితం ఒక్క మార్చి త్రైమాసికంలోనే ఏకంగా 1,046 యూనిట్ల అమ్మకాలు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాదిలో భారత్‌లో మొత్తంగా 50,000 లగ్జరీ కార్ల అమ్మకాలు జరగొచ్చని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ దిల్లన్‌ అంచనా వేశారు.

➡️