నాలుగేళ్లలో టెక్‌ పరిశ్రమలో 35% మంది మహిళ ఉద్యోగులు

Apr 17,2024 21:12 #Business, #team lease digital
  • టీమ్‌లీజ్‌ డిజిటల్‌ అంచనా

న్యూఢిల్లీ : టెక్నాలజీ పరిశ్రమలో 2027 నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్య 35 శాతానికి చేరొచ్చని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ అంచనా వేసింది. ప్రస్తుతం 25 శాతం మంది మహిళా ఉద్యోగులున్నారని పేర్కొంది.. ‘ఉమెన్‌ ఎట్‌ ది హార్ట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ డిజిటల్‌ ఎవల్యూషన్‌’ అనే శీర్షికతో ఆ సంస్థ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ నివేదిక భారతదేశంలోని మహిళా టెక్‌ వర్క్‌ఫోర్స్‌లోని వివిధ అంశాలను పరిశీలించింది. రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్‌ సైంటిస్ట్‌, బ్లాక్‌చెయిన్‌ డెవలపర్‌, ఎఐ ఎథిక్స్‌ ఆఫీసర్‌, ఎఐ పరిశోధకుడు, సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, 5జి టెక్నాలజీ స్పెషలిస్ట్‌, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌ స్పెషలిస్ట్‌ వంటి సాంకేతిక విభాగాల్లో అధిక డిమాండ్‌ ఉంటుందని పేర్కొంది.

➡️