మెకిన్సీలో 360 ఉద్యోగుల కోత

Apr 12,2024 08:04

న్యూయార్క్‌ : పొదుపు చర్యల్లో భాగంగా టెక్‌ దిగ్గజాలు వరుసగా వేటు వేస్తున్నాయి. మరోవైపు ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ గ్లోబల్‌ కన్సల్టింగ్‌ దిగ్గజం మెకిన్సీ 360 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుందని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించే యోచనలోనూ ఉందని పేర్కొంది. డిజైన్‌, డేటా ఇంజినీరింగ్‌, క్లౌడ్‌, సాఫ్ట్‌వేర్‌ సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది సిబ్బందిపై ఈ లేఆఫ్స్‌ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. తొలగింపులతో పాటు పలువురు ఉద్యోగుల పనితీరుపై కూడా హెచ్చరించినట్లు తెలిపింది. సుమారు 3వేల మంది ఉద్యోగులను పనితీరులో మెరుగుదల అవసరం గురించి హెచ్చరించినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

➡️