ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆచితూచి వ్యవహరించిన విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పిఐ)లు ప్రస్తుతం సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు నికరంగా రూ.57,359 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. తొమ్మిది నెలల్లో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. 2024 జనవరిలో రూ.25,744 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా.. ఫిబ్రవరిలో రూ.1539 కోట్లు, మార్చిలో రూ.35,098 కోట్లు నికరంగా పెట్టుబడులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో రూ.8,671 కోట్లు, మే నెలలో రూ.25,586 కోట్లు చొప్పున నిధులు తరలిపోయాయి. జూన్‌లో రూ.25,565 కోట్లు, జులైలో రూ.32,359 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఆగస్టులో రూ.7,322 కోట్ల విలువైన పెట్టుబడులను కుమ్మరించడంతో ఇప్పటి వరకు నికరంగా రూ.1 లక్ష కోట్ల పైనా ఎఫ్‌పిఐలు నమోదయ్యాయి.