న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే ఏకంగా 60 కోట్ల వినియోగదారుల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. దేశంలో తమ కార్యకలాపాలు ప్రారంభించి 10 ఏళ్లు కావడం, ఇదే సమయంలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానున్న వేళ ఈ మైలురాయి యాదృచ్చికమే అయినప్పటికీ తమకు ఇది గొప్ప గర్వకారణమని ఫోన్ పే కో-ఫౌండర్, సిఇఒ సమీర్ నిగమ్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల అవసరాలను తీర్చడంలో ముందుంటామని ఆయన తెలిపారు.
