న్యూఢిల్లీ : ఆదాయపన్ను రిటర్న్స్ (ఐటిఆర్‌ఎస్)లో నూతన రికార్డు నమోదైనట్లు ఆదాయపన్ను శాఖ శుక్రవారం ప్రకటించింది. జులై 31తో గడువు ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 7.28 కోట్లకి పైగా ఐటి రిటర్న్స్ దాఖలయ్యాయని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గతేడాది 6.77 కోట్ల ఐటిఆర్‌ఎస్‌లు వచ్చాయని పేర్కొంది. మొత్తం 7.28 కోట్ల ఐటిఆర్‌ఎస్‌లలో పాత పన్ను విధానంలో దాఖలైన 2.01 కోట్ల ఐటిఆర్‌ఎస్‌లతో పోలిస్తే.. కొత్త పన్ను విధానంలో 5.27 కోట్ల ఐటిఆర్‌ఎస్‌లు వచ్చాయని ఐటి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 31వ తేదీన ఒక్కరోజులోనే 69.92 లక్షల ఐటిఆర్‌ఎస్‌లు దాఖలయ్యాయని వెల్లడించింది. మొదటిసారి ఫైల్ చేసిన వారి నుండి ఐటి శాఖకు సుమారు 58.57 లక్షలు వచ్చినట్లు తెలిపింది.
