79 శాతం కరిగిన ట్విట్టర్‌ విలువ : ఫిడెలిటీ అంచనా

న్యూయార్క్‌ : ఎలన్‌ మస్క్‌కు చెందిన ప్రముఖ సామాజిక దిగ్గజం ఎక్స్‌ (ట్విట్టర్‌) విలువ 78.7 శాతం పతనమయ్యిందని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఫిడెలిటీ అంచనా వేసింది. దీంతో ప్రస్తుత విలువ కేవలం 9.4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.79వేల కోట్లు) మాత్రమే ఉండొచ్చని పేర్కొంది. ఎలన్‌ మస్క్‌ దీనిని కొనుగోలు చేసిన సమయంలో 44 బిలియన్‌ డాలర్లు (రూ.3.68 లక్షల కోట్లు)గా ఉంది. దీని కొనుగోలుకు వెచ్చించిన మొత్తంలో ఆగస్టు నాటికి కేవలం నాలుగో వంతు విలువ మాత్రమే మిగిలిందని ఫిడెలిటీ తెలిపింది.

➡️