స్విగ్గీకి రూ.800 కోట్ల నష్టాలు

Feb 5,2025 21:22 #800 crore losses, #Business, #Swiggy

న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ నష్టాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.800 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.524 కోట్ల నష్టాలు నమోదు చేసింది. క్విక్‌ కామర్స్‌ వ్యాపారంలో జొమాటో, జెప్టోలకు పోటీని ఇవ్వడానికి భారీగా వ్యయాలు చేయడంతో గడిచిన క్యూ3లో నష్టాలు పెరిగినట్లు తెలుస్తోంది. కంపెనీ రెవెన్యూ 31 శాతం పెరిగి రూ.3,993 కోట్లకు చేరింది. 2023-24 ఇదే క్యూ3లో రూ.3,049 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఇదే సమయంలో రూ.3,700 కోట్లుగా ఉన్న వ్యయం.. గడిచిన క్యూ3లో రూ.4,898 కోట్లకు చేరింది.

➡️