హైదరాబాద్ : బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘బంధన్ నిఫ్టీ అల్పా లో వాలటిలిటీ 30 ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ ఒపెన్ ఎండెడ్ స్కీమ్‌లోని నిధులను ఎంపిక చేసిన స్టాక్స్‌ల్లో పెట్టుబడులను పెట్టనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత అనిశ్చితి మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదం చేస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. ఈ ఎన్‌ఎఫ్‌ఒ జనవరి 08న ప్రారంభమై.. 20తో ముగియనుందని బంధన్ ఎఎంసి సిఇఒ విశాల్ కపూర్ తెలిపారు.