న్యూఢిల్లీ : షావోమికి చెందిన రెడ్‌మీ భారత మార్కెట్లోకి బడ్జెట్ ధరలో కొత్తగా ఎ5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6.88 అంగుళాల డిస్‌ప్లే, 32 ఎంపి ప్రధాన కెమెరా సహా 8ఎంపి సెల్ఫీ కెమెరా, యుఎస్‌బి టై సి పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లతో దీన్ని రూపొందించింది. 3జిబి, 64 జిబి వేరియంట్ ధరను రూ.6,499గా, 4జిబి, 128 జిబి వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించింది. ఏప్రిల్ 16 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ను మైక్రో ఎస్‌డి కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమోరిని పెంచుకునే సౌలభ్యం ఉందని ఆ కంపెనీ తెలిపింది.
