సామ్‌సంగ్‌ నుంచి ఎఐ గృహోపకరణాలు

Apr 3,2024 21:40 #Business

ముంబయి : సామ్‌సంగ్‌ ఇండియా కొత్తగా ఎఐ ఆధారిత బెస్పోక్‌ గృహోకరణాలను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇవి ప్రీమియం ఉపకరణాల విభాగంలో వినియోగదారుల అంచనాలను చేరనున్నాయని ఆ సంస్థ పేర్కొంది. బుధవారం ముంబయిలో వీటినిసామ్‌సంగ్‌ సౌత్‌ వెస్ట్‌ ఏసియా సిఇఒ జెబి పార్క్‌ విడుదల చేశారు. వైఫై, అంతర్గత కెమెరాలు, అధునాతన ఎఐ చిప్‌లను అమర్చినట్లు జెబి పార్క్‌ పేర్కొన్నారు. వీటిలో వాషింగ్‌ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎసిలు, ఓవెన్‌ తదితర ఉత్పత్తులున్నాయి. ఇందులోని ఎనర్జీ మోడ్‌తో రిఫ్రిజిరేటర్లు 10 శాతం, ఎసిలు 20 శాతం, వాసింగ్‌ మిషన్లు 70 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేస్తాయన్నారు.

➡️