తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు వ్యాపారం లక్ష్యం

Nov 28,2024 21:05 #Aim, #Business, #double, #Telugu states
  • వైద్య బీమాలో స్టార్‌ హెల్త్‌కు 33 శాతం వాటా
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ సనత్‌ కుమార్‌ వెల్లడి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ : వైద్య బీమా రంగంలో స్టార్‌ హెల్త్‌ 33 శాతం మార్కెట్‌ వాటాతో లీడర్‌గా ఉందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ సనత్‌ కుమార్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆ సంస్థ సీనియర్‌ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కెబిబి శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రూ.3,330 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించామన్నారు. తెలంగాణ, ఎపిలో 100 శాఖలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలో ప్రతీ సెకన్‌కు 10 క్లెయిమ్‌లను పరిష్కరిస్తున్నామన్నారు. సంస్థ ఏర్పడినప్పటి నుంచి కోటి పైగా క్లెయింలను సెటిల్‌ చేశామన్నారు. ఇందులో 74 శాతం క్యాష్‌లెస్‌ అన్నారు. ఆరు లక్షల ఏజెంట్లతో గతేడాది రూ.15,254 కోట్ల స్థూల ప్రీమియం వసూలు చేశామని.. ఈ ఏడాది రూ.18వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
”వ్యాపార కార్యకలాపాల రీత్యా తెలుగు రాష్ట్రాలు స్టార్‌ హెల్త్‌కు చాలా కీలకమైనవి. బీమా విస్తృతిని పెంచడానికి ఎపిని దత్తత తీసుకున్నాము. వైవిద్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన, సరళమైన బీమా సొల్యూషన్స్‌ను అందించడంలో స్టార్‌ హెల్త్‌ నిబద్దతను కలిగి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 1848 హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాము.” అని శ్రీనివాస్‌ తెలిపారు.

➡️