న్యూఢిల్లీ : విక్రేతలు అమెజాన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ లక్షలాది వినియోగదారులను పొందడానికి తాము ప్రోత్సహాన్ని అందించనున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది. ఇందుకోసం ‘దిఖోగే తో బికోగే’ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. చిన్న వ్యాపారాలకు దాని డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లలో అమ్మకాలు ఎలా సరళమైనవి, ప్రభావవంతంగా ఉంటాయో అవగాహనను బలోపేతం కల్పించటానికి ఈ ప్రచారం దోహదం చేయనుందని పేర్కొంది. అంతర్జాతీయంగా 18 దేశాల్లో అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపింది.
