న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల వేదిక అమెజాన్ పే ఇండియా దేశంలో 10 కోట్ల ఖాతాదారులకు చేరినట్లు ప్రకటించింది. కేవలం 3.5 సెకన్లలోనే చెల్లింపులు పూర్తి అవుతున్నాయని తెలిపింది. 2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తమ యాప్‌ను ఎక్కువగా 18-24 ఏళ్ల లోపు వారు ఎక్కువగా అనుసరిస్తున్నారని అమెజాన్ పే ఇండియా సిఇఒ వికాస్ బన్సల్ తెలిపారు. తమ యాప్‌ను ఎక్కువగా మొబైల్ రీఛార్జీలు, యుటిలిటి బిల్లు చెల్లింపులు, ఇ- కామర్స్ లావాదేవీలకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారన్నారు.
