శాన్‌ప్రాన్సిస్కో : ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) టిమ్ కుక్ వార్షిక వేతనం 18 శాతం పెరగనుంది. దీంతో ఆర్ధిక సంవత్సరం 2024-25గానూ టిమ్‌కు 74.6 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.643 కోట్లు) వేతనం చెల్లించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఆపిల్ ఈ నిర్ణయం తీసుకోనుందని రిపోర్టులు వస్తున్నాయి. ఈ సమావేశంలో కుక్ జీతంతో సహా పలు ప్రతిపాదనల్ని వాటాదారుల ముందుంచి ఆమోదించనున్నారని సమాచారం.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/Apple-CEO-Tim-Cook.jpg)