వాషింగ్టన్ : ప్రీమియం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీదారు ఆపిల్ కంపెనీకి కీలక అధికారి గుడ్‌బై చెప్పారు. ఐఫోన్లు, ఆపిల్ వాచీల డిజైన్‌ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇది ఆపిల్ కంపెనీకి పెద్ద దెబ్బనేనని ఆ వర్గాలు పేర్కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ఆపిల్ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక తదితర కీలక విషయాలను టాన్ బృందమే నిర్వహిస్తుంది.
