హైదరాబాద్ : మిత్సుబిషి హెవీ ఇండిస్టీస్ కోసం ప్రత్యేకంగా లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించినట్లు ఆజాద్ ఇంజనీరింగ్ తెలిపింది. హైదరాబాద్‌లోని తునికొల్లారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యూ లీన్ తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఎంహెచ్‌ఐ ఎనర్జీ సిస్టమ్ జిటిసిసి బిజినెస్ డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మసాహిటో కటావోకా, తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఆజాద్ ఇంజనీరింగ్ చైర్మన్, సిఇఒ రాకేష్ చోప్దార్ తదితరులు పాల్గొన్నారు. ఎంహెచ్‌ఐతో ఆజాద్ ఇంజనీరింగ్ దశాబ్దకాల భాగస్వామ్యంలో ఈ లీన్ మాన్యుఫాక్చరింగ్ ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని రాకేష్ చోప్దార్ పేర్కొన్నారు. 2024 నవంబర్ 3న ఆజాద్ జపాన్‌లోని మిత్సుబిషి హెవీ ఇండిస్టీస్ లిమిటెడ్‌తో దీర్ఘకాలిక కాంట్రాక్ట్, ప్రైస్ అగ్రిమెంట్ (ఎల్టిసిపిఎ)పై సంతకం చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.
