బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ‘మల్టీ క్యాప్‌ ఫండ్‌’ ఆవిష్కరణ

ముంబయి : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎఎంసి కొత్తగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది, ఇది లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప, స్మాల్‌ క్యాప్‌ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఓపెన్‌ ఎండ్‌ ఈక్విటీ స్కీమ్‌ అని పేర్కొంది. ఫిబ్రవరి 6 నుంచి ఫండ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం తెరువబడి.. 20తో ముగియనుందని తెలిపింది. ఆకర్షణీయమైన ధరలకు, వాటి అంతర్లీన విలువకు దిగువన అందుబాటులో ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టాలనే వ్యూహాన్ని ఉపయోగించనున్నట్లు ఆ సంస్థ సిఇఒ గణేష్‌ మోహన్‌ పేర్కొన్నారు. రాబడితో పాటు క్రమశిక్షణతో స్థిరమైన సంపదను అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇందులో కనిష్ట మొత్తం రూ.500 నుంచి పెట్టుబడిగా పెట్టొచ్చన్నారు.

➡️