నైట్‌ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్
ప్రజాశక్తి – హైదరాబాద్ : గడిచిన ఏడాదిలో హైదరాబాద్‌లో గిడ్డంగుల డిమాండ్ 35 లక్షల చదరపు అడుగులుగా నమోదయ్యిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ చేసింది. మొత్తం లావాదేవీల్లో తయారీ రంగం అత్యధికంగా 34 శాతం వాటాను.. రిటైల్ రంగం 33 శాతం వాటాను కలిగి ఉన్నాయి. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి శంషాబాద్ క్లస్టర్‌లో గిడ్డంగులకు ఎక్కువ డిమాండ్ చోటు చేసుకుంది. గతేడాది మొత్తం లావాదేవీల్లో శంషాబాద్ క్లస్టర్ ఏకంగా 47 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం. ఈ క్లస్టర్‌లో శంషాబాద్, ఎరోట్రోపోలిస్, శ్రీశైలం హైవేస్, బొంగ్‌లూర్, కొతూర్, షాద్‌నగర్ ప్రాంతాలు ఈ క్లస్టర్‌లో వస్తాయి. 2024లో హైదరాబాద్ గిడ్డంగుల మార్కెట్‌లో సగటున చదరపు అడుగుకు రూ.20.7 అద్దె చెల్లింపులు జరిగాయి. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే అద్దెలో 1 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మెడ్చల్ క్లస్టర్ 46 శాతం, పటాన్‌చెరు క్లస్టర్ 7 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నాయి.
