ఎఐతో ఉద్యోగాలకు పెను ముప్పు

May 14,2024 22:07 #Business
  • ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా హెచ్చరిక

జ్యూరిచ్‌ : కృత్రిమ మేధా(ఎఐ)తో ఉద్యోగాలకు పెను ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా అన్నారు. జ్యూరిచ్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎఐ ఉద్యోగ మార్కెట్‌పై సునామీలా విరుచుకుపడొచ్చని హెచ్చరించారు. వచ్చే రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొన్నారు. ఎఐ దెబ్బతో అభివృద్థి చెందిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు ఈ సంఖ్య 40 శాతం వరకు ఉండొచ్చన్నారు. ఎఐని సరిగ్గా నిర్వహించకుంటే ఆదాయ అసమానతలకూ దారి తీస్తుందని హెచ్చరించారు. ఎఐ అభివృద్థి, ఆచరణలోకి తీసుకురావడానికి అన్ని దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. చాట్‌జిపిటి మాతృ సంస్థ ఓపెన్‌ ఎఐ జిపిటి-4 మోడల్‌ను ఆవిష్కరించగా.. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ టెక్నాలజీకి మరిన్ని ఎఐ ఫీచర్లను జోడిస్తోంది.

➡️