Gold – పుత్తడి ధర మళ్లీ పెరిగింది..!

అమరావతి : పుత్తడి ధర పెరిగింది..! వరుసగా మూడు రోజులు స్థిరంగా కొనసాగిన గోల్డ్‌ రేట్స్‌.. బుధవారం మళ్లీ పెరిగాయి. 2024లో గోల్డ్‌ రన్‌ హై స్పీడ్‌లో సాగింది. ఈ 2025లో కూడా అంతకుమించి బంగారం పరుగులు తీస్తుందని వ్యాపారవేత్తలు అంటున్నారు. దేశీయ మార్కెట్లో రూ.90 వేలకు చేరే ఛాన్స్‌ ఉందంటున్నారు..! ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.100 పెరగగా, 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్‌ మార్కెట్‌లో బుధవారం (జనవరి 8) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,250గా.. 24 క్యారెట్ల ధర రూ.78,820గా ఉంది. మరోవైపు నిన్న భారీగా పెరిగిన వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి రూ.లక్షగా కొనసాగుతోంది.

22 క్యారెట్ల బంగారం ధరలు :
హైదరాబాద్‌ – రూ.72,250
విజయవాడ – రూ.72,250
ఢిల్లీ – రూ.72,400
చెన్నై – రూ.72,250
బెంగళూరు – రూ.72,250
ముంబై – రూ.72,250
కోల్‌కతా – రూ.72,250
కేరళ – రూ.72,250

24 క్యారెట్ల బంగారం ధరలు :
హైదరాబాద్‌ – రూ.778,820
విజయవాడ – రూ.78,820
ఢిల్లీ – రూ.78,970
చెన్నై – రూ.78,820
బెంగళూరు – రూ.78,820
ముంబై – రూ.78,820
కోల్‌కతా – రూ.78,820
కేరళ – రూ.78,820

కిలో వెండి ధరలు :
హైదరాబాద్‌ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.92,500
ముంబై – రూ.92,500
చెన్నై – రూ.1,00,000
కోల్‌ కతా – రూ.92,500
బెంగళూరు – రూ.92,500
కేరళ – రూ.1,00,000

➡️