న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు మరో బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. హోలి ధమాకా ఆఫర్‌లో భాగంగా రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు 30 రోజుల అదనంగా వ్యాలిడిటీని పెంచింది. గతంలో ఈ ప్లాన్ చెల్లుబాటు 395 రోజులుగా ఉంది. తాజా ఆఫర్‌తో 425 రోజులకు పెరగనుంది. ఈ ప్లాన్‌లో భారత్ అంతటా అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చని బిఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2జిబి హై స్పీడ్ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. మొత్తం ప్లాన్ వ్యవధిలో మొత్తం 850జిబి డేటా అందించనుంది.
