ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండి బాకీల రద్దు

న్యూఢిల్లీ : భారత బ్యాంకింగ్‌ రంగంలో ప్రతీ ఏడాది సగటున రూ.2 లక్షల కోట్ల చొప్పున మొండి బాకీలు రద్దు అవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2019-20 నుంచి 2023-24 మధ్య రూ.9.90 లక్షల కోట్ల పారు బకాయిలను బ్యాంకులు రద్దు చేశాయి. ”2019-20లో రూ.2.34 లక్షల కోట్లు, 2020-21లో 2.03 లక్షల కోట్లు, 2021-22లో 1.75 లక్షల కోట్లు, 2022-23లో రూ.2.08 లక్షల కోట్లు, 2023-24లో రూ.1.70 లక్షల కోట్ల చొప్పున ఎన్‌పిఎలను కొట్టిపారేశాయి.” అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యధిక మొత్తంలో రుణాలు రద్దు చేయబడిన మొదటి పది బ్యాంకుల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. ఎన్‌పిఎలను రద్దు చేసినప్పటికీ.. రికవరీ చర్యలు కొనసాగుతాయని మంత్రి పంకజ్‌ చౌదరీ పేర్కొన్నారు 2024 మార్చి 31 నాటికి భారత్‌లోని మొత్తం బ్యాంక్‌ల స్థూల ఎన్‌పిఎలు రూ.4.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎస్‌బిఐకి చెందిన రూ.84,276 కోట్ల ఎన్‌పిఎలు, తర్వాత స్థానంలో పిఎన్‌బి ఎన్‌పిఎలు రూ. 56,343 కోట్లుగా ఉన్నాయి.

➡️