వాట్సాప్‌లోనూ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ -హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెల్లడి

Jun 11,2024 21:30 #Business

ముంబయి : వాట్సాప్‌ ద్వారా కూడా తక్షణ మోటార్‌ క్లెయిమ్‌ల పరిష్కారాన్ని ప్రారంభించినట్లు బీమా సంస్థ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తెలిపింది. తన డిజిటల్‌ ఫస్ట్‌ విధానానికి అనుగుణంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ప్రత్యేక చొరవ తమ వినియోగదారులకు అవాంతరాలు లేని సేవలను అందించేందుకు, సాంకేతికతను వినియోగించుకోవడంలో కంపెనీ చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శమని ఆ సంస్థ డైరెక్టర్‌ పార్థనిల్‌ ఘోష్‌ తెలిపారు.

➡️