మూడు రోజుల లాభాలకు తెర

Jun 11,2024 09:58 #Business

ముంబయి : ప్రధానీగా మూడో సారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే స్టాక్స్‌ ప్రతికూలతను ఎదుర్కోన్నాయి. వరుసగా మూడు రోజులు లాభాల్లో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల పాలయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 203 పాయింట్ల నష్టంతో 76,490కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 31 పాయింట్లు తగ్గి 23,259 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 77,079 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్‌ 77 వేల మార్కును దాటడం ఇదే మొదటిసారి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, టిసిఎస్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, మారుతి సుజుకి షేర్లు 2.6 శాతం వరకు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

➡️