తరుగుతున్న విదేశీ మారకం నిల్వలు

ముంబయి : భారత విదేశీ మారకం నిల్వలు తగ్గిపోతున్నాయి. అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడం.. రూపాయి విలువ పడిపోవడంతో మారకం నిల్వలపై ఒత్తిడి పెరిగింది. నవంబర్‌ 22తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 1.31 బిలియన్‌ డాలర్లు తరిగి పోయి 656.58 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం వారంలో ఏకంగా 17.761 బిలియన్‌ డాలర్లు కరిగిపోయాయి. సెప్టెంబర్‌లో ఆల్‌టైం రికార్డ్‌ 704.89 బిలియన్లుగా ఉన్న ఫారెక్స్‌ రిజర్వుల నుంచి 47 బిలియన్లు కరిగిపోయాయి.

➡️