ముంబయి : ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో టాటా మోటార్స్ గ్రూప్ గ్లోబల్ అమ్మకాలు 11 శాతం తగ్గి 3,04,189 యూనిట్లకు పరిమితమయ్యాయి. జాగ్వర్ లాండ్ రోహర్ అమ్మకాలు 10 శాతం తగ్గి 87,303 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 6 శాతం తగ్గి 1,30,753 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి.
