న్యూఢిల్లీ : భారత్‌లో అసాధారణమైన కుటుంబ యాజమాన్య వ్యాపారాలు, యునికార్న్‌లు అందిస్తున్న తోడ్పాటును గుర్తించే లక్ష్యంతో కొత్తగా ఎంటర్‌ప్రైజ్ గ్రోత్ అవార్డ్స్ 2024 (ఇజిఎ 2024) ఎడిషన్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డెలాయిట్ ఇండియా ప్రకటించింది. అత్యుత్తమ నాయకత్వం, వృద్థిని ప్రదర్శించే, తమ స్థానిక కమ్యూనిటీల అభివృద్ధికి భారీ సహకారాన్ని అందించే కంపెనీలను ఈ అవార్డుల ద్వారా గుర్తించనున్నట్లు పేర్కొంది. రూ.1000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల టర్నోవర్ కలిగిన కుటుంబ వ్యాపార సంస్థలు దరఖాస్తుకు అర్హత కలిగి ఉంటాయని పేర్కొంది.