లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. నేటి ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్‌ 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 108.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75.5 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.76 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 1.2 శాతం దిగజారింది. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్‌ బ్యాంక్‌ శుక్రవారం (7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్‌ ధరల ఇండెక్స్‌ (సీపీఐ) డిసెంబర్‌లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

➡️