- సామ్‌సంగ్ వెల్లడి
గూర్‌గావ్: ప్రస్తుత ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో తమ ఎసి అమ్మకాల్లో రెట్టింపు వృద్ధిని నమోదు చేశామని సామ్‌సంగ్ డిజిటల్ అప్లయిన్సెస్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ గుఫ్రాన్ అలాం తెలిపారు. ఈ రంగం పరిశ్రమ 20-25 శాతం పెరుగుదలను చవి చూడగా.. తమ సంస్థ మరింత మెరుగ్గా రాణించిందన్నారు. ఎసి విభాగంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నామన్నారు. తమ కొత్త బెస్పోక్ ఎఐ విండ్ ఫ్రీ ఎసి శ్రేణీ ధరలు రూ.32,990-రూ.60,990గా ఉన్నాయన్నారు.