విజయవాడలో డైపోల్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు

  • హైదరాబాద్‌, బెంగళూరులో ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌

ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో : అస్ట్రేలియాలో 12 ఏళ్లుగా ఐటి, కమ్యూనికేషన్స్‌, బ్రాడ్‌ కాస్టింగ్‌ రంగంలో సేవలందిస్తున్న డైపోల్‌ గ్రూపు భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించినట్లు ప్రకటించింది. ప్రధానంగా దక్షిణాదిలో తన కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ప్రధాన కార్యాలయం ఏర్పాటు, ఉపాధి కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపింది. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఎంఎల్‌ఎ గద్దె రామ్మోహన్‌ రావు ప్రారంభించారు. మరోవైపు హైదరాబాద్‌, బెంగళూరులో తన ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు గణనీయమైన ఉపాధిని సృష్టించడానికి ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ రవి నెక్కలపూడి, ఎండి సాగర్‌ చాప్కే తెలిపారు. రాబోయే 3-5 సంవత్సరాలలో, డిపోల్‌ గ్రూప్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దాదాపు 500ల మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన ఐటి నిపుణులకు ఉపాధి, స్థానిక ఉద్యోగ కల్పన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్‌తో పాటు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️