రాష్ట్రంలో కెవిబి కొత్త శాఖల ఏర్పాటు

ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో : రాష్ట్రంలో రెండు కొత్త శాఖలను ఏర్పాటు చేసినట్లు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ తెలిపింది. వీటిని కడప, విశాఖపట్నంలో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. విశాఖలోని మురళినగర్‌లో ఏర్పాటు చేసిన కెవిబి నూతన శాఖను శుక్రవారం దేవాదాయశాఖ ప్రాంతీయ జాయింట్‌ కమిషనర్‌, సింహాచలం దేవస్థానం మూల్యాంకన అధికారి త్రినాధ్‌ రావు ప్రారంభించారని వెల్లడించింది. కడపలోని శాఖను రెవెన్యూ డివిజనల్‌ అధికారి జాన్‌ ఇర్విన్‌ పాలపర్తి లాంచనంగా ప్రారంభించారని తెలిపింది. వీటితో పాటు తమిళనాడులో రెండు కొత్త శాఖలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దీంతో తమ మొత్తం శాఖల సంఖ్య 858కి విస్తరించినట్లు పేర్కొంది.

➡️