కార్గో విమానాల్లో 600 టన్నుల ఐఫోన్‌ల ఎగుమతులు

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం అడ్డగోలుగా వేస్తోన్న టారిఫ్‌ల నేపథ్యంలో ఆపిల్‌ కంపెనీ ముందు జాగ్రత్తగా తన ఉత్పత్తులను అమెరికాకు తరలించుకుంటుంది. అధిక పన్నుల నుంచి తప్పించుకోవడానికి వీలుగా భారత్‌ నుంచి 600 టన్నులు లేదా సుమారు 15 లక్షల ఐఫోన్లను ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు తరలించినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. ఇటీవల ట్రంప్‌ చైనాపై 125 శాతం, భారత్‌పై 26 శాతం, ఇతర దేశాలపైనా భారీగా సుంకాలు వేస్తోన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. చైనా మినహా మిగితా దేశాలపై 90 రోజుల వరకు సుంకాల అమలును వాయిదా వేశారు.

➡️